Random Video

కొమ్మినేని అరెస్టు దారుణం | Sajjala Ramakrishna Reddy on Kommineni SrinivasaRao Arrest | Asianet

2025-06-09 0 Dailymotion

సాక్షిటీవీ డిబేట్‌లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం మూడు రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనలకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్‌డ్‌గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టడాలు, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు జరిగాయన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్‌లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రంను భ్రష్టుపట్టిస్తున్న చంద్రబాబు పాలనపై పౌరసమాజం, పాత్రికేయలోకం, మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు.

#sajjalaramakrishnareddy #komminenisrinivasarao #ysrcp #ysjagan #amaravati #appolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️